ఈ నగరం జాబిల్లి : గజల్ లక్ష్య లక్షణాలు చెప్పే గీతి కావ్యం
Item Preview
Share or Embed This Item
- Publication date
- 2022-05-28
- Usage
- Public Domain Mark 1.0
- Topics
- Ee Nagaram Zabilli Gazal Kavyam, seshendra Sharma, Visionary Poet, Indian Poet Prophet, ఈ నగరం జాబిల్లి, గజల్ లక్ష్య లక్షణాలు చెప్పే గీతి కావ్యం
- Language
- Telugu
ఈ నగరం జాబిల్లి
గజల్ లక్ష్య లక్షణాలు చెప్పే గీతి కావ్యం
Seshendra : Visionary Poet of the millennium
http://seshendrasharma.weebly.com
eBook :
https://kinige.com/book/Ee+Nagaram+Jabilli
• కులీ కుతుబ్‌షా ఉర్దూ గజల్ పిత... గజల్ మీనార్లు మొదట గోల్కొండలో లేచాయి కులీ ఉర్దూ సాహిత్య చరిత్రలో మొదటి ఐతిహాసిక సంఘటనకు నిర్మాత
• గజల్ చేతిలోకి వచ్చి వాలిన ఒక రంగులపక్షి ..... అంత నాజూకు జీవి... దాన్ని కన్నవాడు ఎంత దుఃఖం మోసి కన్నాడో
• గజల్ ఒక కోకిల ఐతే, దాని అంత్యానుప్రాస దాని గొంతుకు అంటుకున్న పాడే పువ్వు
• గజల్ వాస్తవంగా పాడబడే పాట... పాడడానికే వ్రాయబడుతుంది
• గజల్ తరతరాలుగా మానవ భావాల్ని మలుస్తూ వచ్చింది
• ఉర్దూ కవులందరూ ఉర్దూ ప్రజల దైనందిన జీవన క్షణాలన్నింటిలో ప్రవహిస్తూ ఉంటారు
• గజల్ అనే మోహపాశంతో ఉర్దూ కవి ప్రజల్ని బంధించి తనవైపుకు లాక్కుంటాడు మాట శక్తే మానవుడ్ని ప్రభావితం చేయగల ఏకైక ఆయుధం అని చూపిస్తాడు
• ఉర్దూ కవి కొన్ని శతాబ్దాల నుంచీ ఒక జీవన దృక్పథాన్ని సృష్టించాడు అది ఉర్దూ ప్రజల ఆలోచనల్ని నాజూకు దనంతో శిల్పించింది
• నివాస గృహాల్లో పూల మొక్కలా మధుశాలల్లో షరాబులా కార్యాలయాల్లో.... గరం చాయ్‌లా గజల్ అల్లుకుపోయింది
• ఉర్దూ కవికి సమాజంలో ఉన్న గౌరవం నాగరికజాతికి గర్వకారణం
• గజల్ కవితగా పుట్టి సంస్కృతిగా మారింది
• ఉర్దూ సంస్కృతికి పునాది ఖురాన్ కాదు... గజలే
* * *
ఈ నగరం జాబిల్లి
గజల్ లక్ష్య లక్షణాలు చెప్పే గీతి కావ్యం
• “సుకవితా యద్యస్తి రాజ్యేనకిం?” సుకవిత చేతిలో ఉన్నవాడికి రాజ్యంతో పనేమిటి? అన్న ప్రాచీన సూక్తి తాత్పర్యం ఈనాటి తెలుగువారు బహుశా ఊహించను కూడా లేరు
• ఆయుర్వేదం మనిషి భౌతిక శరీరం కోసమైతే కవిత్వం మనిషి భావాత్మక శరీరం కోసం పుట్టిన అమృతరూప ఆయుర్వేదం
• గజల్ వంటి అనుష్టుప్పులు వాల్మీకిలో అసంఖ్యాకంగా వున్నాయి
• వేమన ఆటవెలది గజల్ దావా దలీల్ టెక్నిక్‌కి నిలిచే విద్య
• అన్య భాషల్లో గజల్ రాయడమే కష్టం... మెప్పించడమన్న ప్రశ్నే లేదు మోసం మాత్రం చేయొచ్చు వాటంగా ఒక అజ్ఞాన పాఠకలోకం దొరికితే
- శేషేంద్ర
* * *
గజల్ ఉర్దూ భాషకు చెందిన కావ్యప్రక్రియ, కవితారూపం. 6 శతాబ్దాల సుదీర్ఘ పయనంలో ఎందరో ఉర్దూ కవిసార్వభౌములు గజల్‌ను బహుభంగిమల్లో సుందరీకరించారు. సుసంపన్నం చేశారు. ప్రపంచ కవితా చిత్రపటంలో గజల్ ఒక అపూర్వ హిమాలయం. ఒక ప్రక్రియ తన ఆకర్షణ శక్తి ప్రభావం అనుసరణగా వ్యక్తమవుతుంది. తెలుగు ప్రబంధ కావ్య రూపాలైన మత్తేభం, శార్దూలం, చంపకమాల, తమిళం, రష్యన్, బెంగాలీ తదితర అన్యభాషల్లో సృష్టించడం ఎలా అసాధ్యమో అలాగే ఉర్దూ భాషాబద్ధమైన గజల్ అన్యభాషల్లో సృష్టించడం అంతే అసాధ్యం.
ఈ రోజు తెలుగు కవితా క్షేత్రంలో గజల్ కవిసమ్మేళనాలు జరుగుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో గజల్ రచయితలు నలుదిక్కులా వ్యాపిస్తున్నారు. గజల్ సంకలనాలు భారీ సంఖ్యలో అచ్చయి బజార్లను ముంచెత్తుతున్నాయి.
వచనకవిత ముసుగులో వచ్చే అకవితను అరికట్టి కవిత్వానికి నిర్వచనం చెప్పే ఆధునిక కావ్యశాస్త్రం కవిసేన మేనిఫెస్టో రాసిన శేషేంద్ర, గజల్‌కు నిర్వచనం చెబుతున్నాడు. 'తెలుగు గజల్' 'పొట్ట విప్పే' లక్ష్యంతో గజల్ పుట్టుక, చరిత్ర వ్యాప్తి ఇత్యాది ముఖ్యాంశాలపై 1985లో రాసిన వ్యాసపరంపరే ఈ నగరం జాబిల్లి.
అన్ని కాలాల్లోలాగే అన్ని సమజాల్లోలాగే లౌక్యం, లోపాయికారీ, పైరవీ, పాదసేవ గోడమీద పిల్లివాటం - ఈ బ్రతుకుదెరువు పంచభూతాలు వర్తమాన తెలుగు సాహిత్యంలో, ప్రబలంగా ప్రబలివుతున్నాయి. కనుకనే రంగంలో పెద్దలుగా వున్న కవులు గానీ విమర్శకులు గానీ పాషాణ మౌనం వహించారు.
ఈ సందర్భంలోనే సజ్జనులైన సాహితీవేత్తలకు అగమ్యగోచరులైన సామాన్య పాఠకులకు గజల్ వాస్తవాలు ఎరుకపరిచి శాస్త్రీయ అవగాహన కల్పించడానికి ఈ గజల్ పాథ్రమిక పాఠ్యపుస్తకం మూడవ పునర్ముద్రణ ప్రచురిస్తున్నాం. నిజాయితీపరులైన విజ్ఞులు ఈ కావ్యానికి స్వాగతం పలుకుతారు సమాదరిస్తారు.
* * *
ఈ నగరం జాబిల్లి వ్యాసాలు తొలిసారి ఆంధ్రజ్యోతిలో ధారావాహికగా వచ్చాయి. 1984లో ఆంధ్రజ్యోతిలో సి. నారాయణ రెడ్డి రాసిన తెలుగు గజళ్లు వరుసగా వచ్చిన తరువాత గజల్‌పై కళ్లు తెరిపించే ఈ నగరం జాబిల్లి వ్యాసాలు ఆంధ్రజ్యోతిలోనే రావడం గమనించాల్సిన విషయం. అంటే సినారె గజళ్లు సరైనవి కావని తెలియరావడంవల్లో, అవి గజల్ స్థాయి రచనలు కాకపోవడంవల్లో, జరిగిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంగానో ఆ పత్రికా సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్యశర్మ శేషేంద్రశర్మ చేత గజల్‌పై అవగాహన కలిగించే ఈ వ్యాసాలను రాయించడం జరిగిందని అవగతమౌతోంది. గజళ్లు అని రాసిన సి. నారాయణ రెడ్డికి గజల్ ప్రక్రియపైనా, గజలియత్పైనా అవగాహన లేదు. అవగాహనా రాహిత్యంతో ఆయన గజళ్లు అని రాశారు. సినారె గజళ్లు అని రాసిన వాటిల్లో గజల్ స్థాయిలో, శైలిలో ఒక్కటంటే ఒక్క రచన కూడా లేదు. సి. నారాయణ రెడ్డి వల్ల తెలుగులో గజల్ విదూషకత్వమైపోయి తెలుగు సాహిత్యానికే తలవంపును తీసుకు వచ్చింది. అటు తరువాత కేశిరాజు శ్రీనివాస్ చేసే బిగి, సాంద్రత, సంగీతజ్ఞత, మాధుర్యం, నిండుతనం, శ్రుతి, తాళం లేని లొల్లాయి గానం కోసం రెంటాల శ్రీ వేంకటేశ్వరరావు, రసరాజు, వంటి వాళ్లు గజళ్లు అని రాసిన రచనల వల్లా, ఆ తరువాత 2014లో అబ్దుల్ వాహెద్ ఫేస్ బుక్ లో ఒక గజల్ గ్రూప్ నిర్వహించడం వల్లా గజల్ తెలుగులో గజల్ కాకుండా పోయింది. అబ్దుల్ వాహెద్ సారథ్యంలో జరిగిన ప్రహసనం వల్ల గజల్ మాత్రమే కాదు తెలుగుభాష కూడా భ్రష్టుపట్టిపోయింది. తెలుగు పదాలు, వాక్యాలపైనా ప్రాథమికమైన అవగాహన కూడా లేని అబ్దుల్ వాహెద్ ను తెలుగు గజల్‌కు పెద్దన్నయ్య అనీ, తెలుగు గజల్ ను అబ్దుల్ వాహెద్ కొత్త పుంతలు తొక్కించడం జరిగిందనీ బాధ్యతారాహిత్యంతోనూ, అవగాహనా రాహిత్యంతోనూ రజాహుస్సైన్ చెప్పడం గజల్నూ, తెలుగుభాషనూ, సాహిత్యాన్నీ అవమానించడం. సురారం శంకర్ అనే ఓ గజల్ గురువు ముక్క అన్న పదం బహువచనం అని బహిరంగంగా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి తెలుగు గజల్, గజల్ తెలుగు ఏ స్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఓ దినపత్రికలో తెలివిడి లేకుండా బిక్కి కృష్ణ గజల్ కాని రచనల్ని గజళ్లంటూ విశ్లేషించడమూ, తప్పుడు రాతల వ్యాసాలు రాయడమూ వల్ల తెలుగులో గజలకు మరింత కీడు జరిగింది. గజళ్లూ అనీ, గజళ్లపై రచనలూ అనీ రాసిన పెన్నా శివరామకష్ట గజల్ విషయంగా “నేను తప్పులే చేస్తాను, వాటిని విమర్శకులకూ, కాలానికి వదిలేస్తాను” అని బహిరంగంగా చెప్పిన గర్షనీయమైన స్థితిలో ఇవాళ తెలుగు గజల్ ఉంది. ఇవాళ తెలుగులో గజల్ వికారంగానూ, విదూషకత్వంతోనూ ఉంది. దానికి విరుగుడు ఈ నగరం జాబిల్లి వ్యాసాలు. గజల్ అంటే “పరులకొరకు పాటు పడనీ నరుడి బ్రతుకూ దేనికని” అంటూ రాయడం కాదన్న ప్రాథమిక విజ్ఞత ఇకనైనా తెలుగుకు రావాలి. అందుకు ఈ నగరం జాబిల్లి వ్యాసాలు దిశానిర్దేశం చేస్తాయి.
ఇవాళున్న తెలుగు గజల్ దుస్థితికి వత్తాసుగా "తెలుగు గజల్, ఉర్దూ గజల్ స్థాయిలో ఉండకర్లేదు, తెలుగులో గజల్ ప్రక్రియ సరిగ్గా ఉండాల్సిన అవసరం లేదు, గజల్ అంశాలు తెలుగులో మార్చుకుంటే తప్పులేదు, మార్చుకోవాలి” అని రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు బహిరంగంగా చెబుతూండడం విజ్ఞతా రాహిత్యం, బాధ్యతారాహిత్యం ఆపై గర్హనీయం. కొన్ని వందల ఏళ్ల క్రితం ఒక ప్రక్రియ రూపొంది స్థిరపడి విశ్వవ్యాప్తమైపోయాక ఇప్పుడు చాతకానితనం వల్ల తెలుగులో దాన్ని మార్చేస్తే అప్పుడది ఆ ప్రక్రియ అవదు. అవగాహన, ప్రతిభ లేనివాళ్లు ఉదాసీనంగా ఉండిపోతేనే బావుంటుంది. తమ అవగాహనారాహిత్యాన్నీ, తమ చాతకానితనాన్నీ, తమ దోషాల్నీ సమర్ధించుకునే ప్రయత్నాల వల్ల తెలుగు భాష, సాహిత్యాల పరువుపోతుంది. ప్రపంచం ముందు తెలుగువాళ్లు తలదించుకోవాల్సి వస్తుంది. గజల్ విషయంగా జాతీయస్థాయిలో తెలుగు నవ్వులపాలౌతోంది. ప్రస్తుత పరిస్థితికి భిన్నంగా తెలుగు గజల్‌కు అవగాహన, ప్రతిభ, విజ్ఞత రావాలి. తెలుగు గజళ్లు కాదు తెలుగులో గజళ్లు రావాలి. ఈ నగరం జాబిల్లి వ్యాసాలు అందుకు దారి చూపిస్తాయి.
“గజల్ ఒక అయస్కాంత విద్య, గజల్ ఒక అగ్ని, గజల్ ఒక సంస్కృతి, గజల్ అందము ఛందము, ప్రాచీన ప్రపంచంలో గజల్” అని అంటూ గజల్ గురించి అవగాహనను అందించారు ఈ నగరం జాబిల్లిలో శేషేంద్ర శర్మ.
తెలుగులో గజళ్లూ, గజళ్లపై రచనలూ చేసిన వాళ్లు ఈ నగరం జాబిల్లి వ్యాసాల్ని చదవకపోవడం, వాటి గురించి మాట్లాడకపోవడం క్షమార్హం కాదు. గజళ్లపై ఆసక్తి ఉన్న తెలుగువాళ్లందరూ చదవాల్సిన రచన ఈ నగరం జాబిల్లి. తెలుగు గజల్లో ఉన్న వికారమూ, విదూషకత్వమూ ఇకనైనా లేకుండా పోవాలి. తెలుగు గజల్‌కు అవగాహన కావాలి, రావాలి.
1985లో తొలిసారిగా వెలువడిన ఈ గజల్ వ్యాసాలు ప్రస్తుతం దుస్థితిలో ఉన్న తెలుగు గజల్‌కు ఎంతో అవసరం. అందుకని గజల్ ప్రియులైన తెలుగువాళ్లనందరినీ ఈ నగరం జాబిల్లి వ్యాసాలలోకి మనసా, వాచా ఆహ్వానిస్తున్నాను.
- మీతో
రోచిష్మాన్
(9444012279)
అంతర్జాతీయకవి,
బహుభాషా గజల్ కవి,
గజల్ చరిత్రకారులు,
గజల్ పరిశోధకులు
- Addeddate
- 2022-05-28 04:21:33
- Identifier
- ee-nagaram-zzabill
- Scanner
- Internet Archive HTML5 Uploader 1.6.4